Vrishchika—Scorpio
వృశ్చికం –2016-17
విశాఖ 4 పాదము,
అనూరాధ 1,2,3,4.పాదములు.
జేష్ట 1,2,3,4. పాదములు.
ఆదాయము 2, వ్యయం 8,రాజపూజ్యము 1, అవమానం 2.
ఆగస్టు 11, 2016 వరకు గురుడు పదవ ఇంట లోహమూర్తి, తదుపరి సంవత్సరమంతా పదకొండవ ఇంట సువర్ణమూర్తి. జనవరి 26, 2017 వరకు శని ఒకటవ ఇంట లోహమూర్తిగాను, తదుపరి రెండవ ఇంట సంవత్సరమంతా రజితమూర్తి. పదవ ఇంట రాహువు, నాలుగ ఇంట కేతువు సువర్ణమూర్తి.
ఈ సంవత్సరం వీరికి అన్ని రంగంలోనూ జయం కలిగి శుభఫలితములు కనబడుచున్నవి. స్థిరాస్థి వృద్ధి చేయుట, మానసిక ధైర్యం, తెలివితేటలతో ముందుకు పోగలరు. కొన్ని కొన్ని సమస్యలు వచ్చినా అవి వీగిపోగలవు. భార్యభర్తల మధ్య చిన్నచిన్న సమస్యలు వచ్చినా అవి తొందరగానే సమసిపోగలవు.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు శని ప్రభావం వలన కొంత ఇబ్బంది ఉండగలదు. దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. పై అధికారులచే మాట పడుట, కోర్టు సమస్యలు ఉండగలవు. నిరుద్యోగులకు కొంత ఆశాజనకముగా ఉంది.
రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల్లో విశ్వాసం లభిస్తుంది. ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చు అధికంగా ఉంటుంది. ఆస్తుల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవకాశాలు కలిసి వచ్చి విజయం సాధించుదురు. పరిశ్రమలో నిలుదొక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరికి అవార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వ్యవసాయ రంగం వారికి మొదటి పంట లాభం చేకూరనప్పటికీ, రెండో పంట లాభించును. కౌలుదారులకు కొంత నష్టం తప్పకపోవచ్చును. కొంత మందికి ఆర్థిక ఇబ్బందులు కలుగును. చేపలు, రొయ్యల రైతులకు పెద్దగా లాభం ఉండకపోవచ్చు.
ఈ సంవత్సరం శనికి, కేతువుకి శాంతి చేయించుకోవలెను. శని, కేతు యంత్రాలు ధరించుట శుభము.









Leave a Reply
You must be logged in to post a comment.