1. మూఢము:గురు, శుక్ర గ్రహములు రివితో కలసివుండే వేళను మూఢము లేదా మౌఢ్యము అందురు. ఈ కాలంలో వారు శుభఫలాలనీయరు. కావున వివాహాది ఎట్టి శుభకార్యాలు చేయరాదు.(ఆశ్రేషాది గండ నక్షత్రములకు శాంతి, హోమ, జప, అభిషేకాలు వంటివి మాత్రమే చేయవలెను.)
2. గోధూళికా ముహూర్తం:సూర్యుడున్న ముహూర్తం నుండి 7వది గోధూళిక అనబడును. మేతకు వెళ్ళిన గోవులు మరలివచ్చే-సూర్యాస్తమయ పూర్వవేళ అన్ని ప్రయాణాలకు మంచివి.
7. కనుమలు: మరణం, శవదహనం, సపిండీకరణం, జాతర, సంక్రమణం, గ్రహణం – ఇవి జరిగిన మరుసటి రోజును కనుమ అంటారు.
8. నిషిద్ధనవమీత్రయం:ఏదైనా ఒక ప్రయాణం చేసిన 9వరోజునగాని, ఆ తిథికి 9వ తిథికిగాని, ప్రవేశము చేయరాదు. ప్రవేశించిన నాటి 9వ నాడుగాని 9వ తిథిగాని- అటునుండి బయలుదేరరాదు. వీటినే ప్రయాణనవమి, ప్రవేశనవమి, ప్రత్యక్షనవమి అంటారు. ఈ మూడు నవములు నిషిద్ధములు.
10. అధికమాసము: సూర్యుడు నెలకు 1 రాశి చొప్పున సంవత్సరమునకు 12రాశులలో సంచరించును. ఆయన యొక్క రాశి ప్రవేశమునకే సంక్రమణమని పేరు. అలా సూర్య సంక్రమణం జరుగని శుద్ధపాడ్యమి నుండి అమావాస్య వరకు గల మాసం అధికమాసంగా చెప్పబడుచున్నది.
11.పక్షచ్ఛిద్ర తిథులు : 4,6,9,12,14 తిథులు
12. క్షయ మాసము: చాంద్రమాసమునందలి ఏ మాసమున సూర్యుడు రెండు రాశులలో ప్రవేశించునో – ఆ మాసమును క్షయమాసమందురు.
13. శూన్యమాసము: సూర్యుడు మీనంలో వున్న చైత్రమాసం, మిథునంలో వున్న ఆషాఢం, కన్యలో వున్న భాద్రపదం, ధనుస్సులో వున్నపుష్యమాసం -ఇవి శూన్యమాసములు అనబడును.
14. త్రిసోష్టకములు :మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గునము 4 మాసముల్లోనూ కృష్ణపక్షాన వచ్చే 7,8,9 తిథులతో కూడిన దినములకుత్రిసోష్టకములందురు. ఇవి అనధ్యాయములు.