Menu

Mesham—Aries

Aries

  మేషం-2016

అశ్వని 1234. పాదములు
భరణి 1234. పాదములు
కృత్తిక 1వ పాదం వారికి
ఆదాయము – 2వ్యయము – 8రాజ పూజ్యము 1 – అవమానము – 7

ఆగస్టు 112016 వరకు గురుడు ఐదవ ఇంట తామ్రమూర్తిగానుతదుపరి సంవత్సరమంతా ఆరవ ఇంట లోహమూర్తిగాను సంచరించును.

జనవరి 262017 వరకు శని ఎనిమిదవ ఇంట సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరమంతా తొమ్మిదవ ఇంట రజితమూర్తిగాను వర్తించును.

రాహుకేతువులు పదకొండవ ఇంట సువర్ణమూర్తులుగా సంచరించుదురు.

ఈ రాశివారికి గ్రహస్థిని బట్టి చూడగాధన ఆదాయం బాగుండును. ధన వ్యయం కూడా అధికంగానే ఉండును.

ప్రాణాపాయ సమస్యలుగృహంలో దొంగల భయంభార్యభర్తల మధ్య అన్యోన్యత లోపించుటసంతానం వల్లబంధువుల వల్ల ఇబ్బందులువాహన ప్రమాదంఅగ్నిభయం సూచించును. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలెను. 

ఉద్యోగస్థుల విషయమై చూడగా వారికి అంతగా మంచి ఫలములు లేవు. దూరప్రాంతానికి బదిలీలు,కేంద్రరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇబ్బందులుపై అధికారుల నుంచి అవమానాలుఅక్కర్లేని విషయాల్లో ఇరుక్కోని సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితుల వస్తాయి. కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ తదుపరి కొంచెం ప్రశాంతత ఏర్పడిఉద్యోగం పర్మినెంట్ అవుట జరుగలదు. 

రాజకీయ రంగంలో ఉన్నవారికి చూడగాప్రథమార్థంలో అధినాయకత్వం నుంచి స్వల్ప ఇబ్బందులు ఏర్పడతాయి. పదవులు కోల్పోవుట జరగవచ్చును. ద్వితీయార్థంలో కొంత సమస్యలు తగ్గిప్రశాంతత చేకూరును. 

ఈ సంవత్సరం వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితములు కలవు. సరైన లాభములు రాక ఇబ్బందులు పడుదురు. నూతన వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ సరైన లాభం రాక ఇబ్బందులు పడుదురు. కాంట్రాక్టు వ్యాపారాలు పెద్దగా యోగించవు. రియల్ ఎస్టేట్ వారికి నష్టములుగృహనిర్మాణముల వారికి బాగుండును. షేర్ మార్కెట్ వారికి బాగుండును. 

సినిమాటీవీనాటక రంగముల వారికి ఈ సంవత్సరం బాగుండును. వారు ఆర్థికంగా నిలదొక్కుకుందురు. అవార్డులు పొందే అవకాశం కూడా ఉంది. నూతన నటీనటులు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఏకగ్రతజ్ఞాపకశక్తి ఉండుటమంచి ర్యాంకులు పొందుట. ద్వితీయార్థంలో శని ప్రభావంచే కొన్ని ఇబ్బందులు కలుగును. క్రీడారంగము వారికి వ్యతిరేక ఫలితము ఉండును. కొంత నిరాశ తప్పకపోవచ్చును. 

వ్యవసాయ రంగం వారికి కష్టపడినా ఫలితం ఆశాజనకముగా లేదు. అప్పుల బాధబ్యాంకుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొందురు. కౌలుదారులకు కూడా నష్టమే సూచిస్తున్నది. ఫౌల్డ్రీ రంగము,పండ్ల తోటలువాణిజ్య పరమైన పంటలు కొంతమేర లాభించును. 

ఈ సంవత్సరం ఈ మేష రాశివారు గురునకుశనిశ్వరునకు శాంతులు చేయించుకోవాలి. కేతుగ్రహ యంత్రము ధరించుట శుభం.

మొత్తం మీద ఈ రాశివారికి యోచించి చూడగా మంచి కన్నాచెడు ఫలితములే అధికముగా ఉన్నాయి. ఈ సంవత్సరమంతా జాగ్రత్తగా ఉండుట మంచిది.

Leave a Reply