Mithunam—Gemini
మిధునం – 2016-2017
మృగశిర 3,4,పాదములు.
ఆరుద్ర 1,2,3,4.పాదములు.
పునర్వసు 1,2,3.పాదములు.
ఆదాయము – 14 వ్యయం -13 , రాజపూజ్యం -7, అవమానం -7
ఆగస్టు 11, 2016 వరకు గురుడు మూడవ ఇంట సువర్ణమూర్తి. తదుపరి నాలుగవ ఇంట. శని జనవరి 26 2017 వరకు ఆరవ ఇంట రజిత మూర్తిగాను, తదుపరి ఏడవ ఇంట తామరమూర్తిగాను సంచరించును. రాహు మూడవ ఇంట, కేతువు తొమ్మిదవ ఇంట లోహమూర్తులు.
ఈ రాశివారికి ధనాధాయం బాగుండును. వాహన లాభములు, విలాసవంతమైన జీవితం, సహధర్మచారిని సహాయంతో శుభఫలములు పొందుదురు. పూర్వపు బాకీలు తీర్చుదురు. పట్టుదలతో కార్యక్రమములు పూర్తి చేయుదురు.
ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలముగా చెప్పవచ్చు. ప్రమోషన్స్, కోరుకున్న చోటుకు బదిలీలు, తాత్కాలిక ఉద్యోగులకు కాని వారికి పర్మినెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించును. ప్రవేట్ ఉద్యోగాలు చేసే వారికి మంచి ఫలితములు ఉంటాయి.
రాజకీయ నాయకులు మంచి పదవులు పొందుదురు. అధిష్టానం నుంచి మంచి గుర్తింపు లభించును. ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
ఈ సంవత్సరం హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్థులకు లాభములు బాగుండును. జాయింట్ వ్యాపారాలు కూడా లాభించును. షేర్ మార్కెట్ వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టు చేయువారికి, సరుకులు నిల్వ చేయువారికి మంచి ఫలములు గోచరిస్తున్నాయి.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండును. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి సమయమని చెప్పవచ్చు. వీరికి గుర్తింపు కలిగి అవార్డులు లభించును. నూతన ప్రయత్నాలు చేయువారికి కొంత అవకాశములు తక్కువ.
విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. మంచి మార్కులు, ర్యాంకులు సాధిస్తారు. కోరుకున్న సీట్లు పొందడమే కాకుండా, విదేశాల్లో కూడా చదువు అవకాశాలు వస్తాయి. అదే విధంగా క్రీడాకారులకు కూడా మంచి సమయంగా చెప్పవచ్చు.
ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా ఫలించును. కౌలుదారులు కూడా లాభాలు పొందుతారు. కొన్ని రుణములు తీర్చగలరు. సంతాన సంబంధిత శుభకార్యములు చేస్తారు. రొయ్యలు, చేపల వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది.
ఈ రాశి వారికి కుజునకు శాంతి చేయించుట శుభము. ఈ రాశివారికి నరఘోష అధికం ఉండుటం వల్ల నరఘోషయంత్రం ధరించుట శుభం.









Leave a Reply
You must be logged in to post a comment.