Menu

Vaara Phalamulu – 13-11-2016 To 19-11-2016

Vaara Phalamulu
A professional Astrologer

Gopi Sarma Siddhanthi

Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu AstrologyPredictions
aries
ఉద్యోగ విషయములు మీకు అనుకూలముగా వుంటాయి.దైవ కార్యక్రమములలో పాల్గొంటారు, భుదవారము తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు,వ్యాపార లావాదేవీలు కొంచెము అనుకూలముగాను కొంచెము తలపోటుగాను వుంటాయి, పెద్దలనుడి ప్రశంసలు పొందుతారు.
taurus
ఈ వారము మీకు ఒత్తిడి పెరుగుతుంది, ఒక అమ్మాయి [స్త్రీ] విషయములో మీరు సమస్యలో పడే అవకాశముంది, పట్టుదలకు వితండ వాదానికి పోకుండా ఉండడమే మేలు, గురువారము ఆడవారికి [స్త్రీలకు] శ్రమ పెరుగుతుంది, నిరుద్యోగులు చిక్కుల్లో పడతారు జాగ్రత్త.
gemini
విలువైన వస్తువులు పోయే అవకాశముంది జాగ్రత్త, మిత్రులు సహాయముతో ఉద్యోగ విషయములు చక్కబెట్టుకొంటారు, వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టె ఆలోచనలు అమలు చేస్తారు, దైవ కార్యక్రమములు ఇంటిలో సందడిని కర్చును పెంచుతాయి.
cancer
వ్యాపార లావాదేవీలు ఆశా జనకముగా ఉండడముతో మీకు ఆనందముగావుంటుంది, సోమవారము మిపనులు మీ తెలివితేటలతో చక్క బెట్టుకోవలసి వస్తుంది, భార్యాభర్తలు అనవసరపు విషయములకు తగవుపెంచుకోనుట మంచిదికాదు, వారపు చివరలో ఒక సమస్య మిమ్మలిని చిరాకుకు గురిచేస్తుంది.
leo
ఉన్నవ్యాపారమునకు కొత్త వ్యాపారము జోడించే ఆలోచనలు ఫలిస్తాయి,ఆదాయ వ్యయములు సరి సమానముగా సాగుతాయి, మిమ్మలిని కాదన్నవారు తిరిగి మీ పంచన చేరుతారు, ఇంటిలో కలహాలు పెంచుకోవద్దు, మీ పిల్లల ఉద్యోగవిషయము సమస్యగా వుంటుంది.
virgo
బకాయి విషయములో ఒకరితో గొడవ ఇబ్బందిని పెచుతుంది,ఉద్యోగ విషయములో సంతృప్తిగా వుంటుంది, ఆరోగ్యము జాగ్రత్త వహించవలసి వస్తుంది, ప్రయాణ విషయములు ఈ వారానికి వాయిదా వేయడము మంచిది, ఒకరు మిమ్మలిని మోసగించే అవకాశముంది.
libra
కర్చులు పెరుగుతాయి, చాల పనులు అనుకోన్నట్లుగా సాగవు, డబ్బు ఇబ్బంది తెలుస్తుంది, శనివారము ఒక సమస్యలో చిక్కుకొనకుండా జాగ్రత్తపడండి, ఆత్మీయులు స్నేహితులు సాయము ఉండదమువల్ల సమస్యలు తీరుతాయి, మంగళవారము ఒక అతిధి రాక మీకు లాభము చేకూరుస్తుంది.
scorpion
కొత్త సిస్టం లు ప్రారంబించే పనిలో ఉంటారు, పెద్దవారి పరిచయాలు మీ వ్యాపారాన్ని పెంచుతాయి, అనుకోకుండా వచ్చిన అవకాశాలు మిమ్మలిని సంతోష పెడతాయి, వివాదాలకు దూరముగా వుండండి, వాహనము నడిపెటప్పుడు జాగ్రత్త వహించండి.
sagittarius
ఎవరివిషయములోనైనా మీరు తల దూర్చకుండా ఉండటమే మేలు లేకపోతె అనవసరపు చిక్కుల్లో పడతారు, కర్చులు పెరుగుతున్నపటికి దానికితగ్గా ఆదాయము వుంటుంది, పరిచయములేని వ్యక్తులతో జాగ్రత్త వహించండి, కొత్త ఆలోచనలు మీ పేరును ఇదుమదింప చేస్తాయి.
capricorn
వ్యాపారము మరికొంత మందికి  ఉద్యోగపు ఒప్పందాలు లాబిస్తాయి, తెలిసి ఉన్న మిత్రులే తెలియనట్లు ప్రవర్తించడముతో మిమనస్సు భాదపడుతుంది, కొన్ని పనులు మీరు ఉహించినట్లుగా జరగవు, బ్యాంకు ఋణములు ఇబ్బందిని పెడతాయి.డబ్బుపోయి అవకాశముంది జగ్రత్త.
aquarius
ఇంటిలో బడువుల రాకతో ఉల్లాసముగా వుంటారు, ప్రముఖుల కోసము మీరు పడిగాపులు పడవలసి వుంటుంది, వ్యాపార లాభాలు పెరుగుతవల్ల రాబోయే కాలములోకి  పెట్టుబడులను పెంచు నిర్ణయాలు చేస్తారు, స్థిరాస్తి అమ్మకపు విషయములు వాయిదా వేయుట మంచిది.
pisces
మీకు గౌరవము పెరుగుతుంది డబ్బుకర్చు అంచనాలను దాటుతుంది, స్త్రీల విషయములో జాగ్రతగా మెలుగుట మంచిది,ఒక అవకాసము మీ ఆలోచనలను మార్చుతుంది, కొంతమందికి ఉద్యోగ విషయములో సమస్యలు పెరుగుట లేదా ఉద్యోగము పోవుట సంభవించవచ్చు.
———– చింతా గోపి శర్మ సిద్ధాంతి.