Menu

Karkatakam—Cancer

cancer

కర్కాటకం-2016-2017 

పునర్వసు 4.పాదము.

పుష్యమి 1,2,3,4.పాదములు.

ఆశ్లేష 1,2,3,4.పాదములు.

ఆదాయం – 8, వ్యయం – 11, రాజపూజ్యం 3, అవమానం 3.

                              ఆగస్టు 11, 2016 వరకు గురుడు ధనస్థానమందు లోహమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానమందు రజితామూర్తిగాను, శని ఐదవ ఇంట జనవరి 26, 2017వరకు లోహమూర్తిగాను, తదుపరి ఆరవ ఇంట సువర్ణమూర్తిగాను, సంవత్సరమంతా రాహువు రెండవ ఇంట, కేతువు ఎనిమిదవ ఇంట తామరమూర్తులుగా ఉందురు.

ఈ సంవత్సరమంతా గురుడు శుభుడు. వీరికి ఈ సంవత్సరమంతా గురుడు మంచి స్థానమందు ఉండుట చేత ఏ కార్యమునైనా అవలీలగా సాధించుదురు. సంఘంలో గౌరవం పొందుదురు. స్వల్ప అనారోగ్యంను రాహుకేతువు సూచించును. ప్రయాణములందు తగు జాగ్రత్త వహించవలెను. భార్యభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.

ఈ సంవత్సరం ఉద్యోగస్తులు ప్రత్యేకమైన గుర్తింపు పొందుదురు. ప్రభుత్వ కార్యాలయం యందు పని చేయువారికి ప్రమోషన్లు, బదిలీలు సూచించుచున్నవి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం యోగకరమైన సమయం. ప్రైవేటు కంపెనీల్లో పని చేయువారు మంచి ఫలములు పొందగలరు.

ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు కూడా మంచి ఫలములు కలవు. వారికి అధిష్టానంలోనూ, ప్రజల్లోనూ మంచి గుర్తింపు లభించును. దైవపరమైన కార్యక్రమాల్లో పాల్గొనుట, ప్రజల కోసం కొత్త ప్రణాళికలు నిర్వహించుదురు.

నూతన వ్యాపారం చేయువారికి ఈ సంవత్సరం మంచి సమయము. హోల్ సేల్, రిటైల్, కాంట్రాక్టు రంగం వారికి అభివృద్దికరంగా ఉండగలదు. షేరు మార్కెట్ గత సంవత్సరంకన్నా బాగుండగలదు. భాగస్వామిక వ్యాపారం కూడా అభివృద్ధికరంగా ఉంటుంది.

ఈ సంవత్సరం సినిమా, టీవీ, నాటక రంగముల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశములు బాగా కలిసి వచ్చి తమ రంగంలో నిలదొక్కుకుందురు. ప్రభుత్వ గుర్తింపు లభించి అవార్డులు పొందుదురు.

ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి మార్కులు లభించును. ఎంట్రాన్స్ టెస్టులయందు ప్రథమ స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాలయందు, కోరుకున్న చోట సీట్లు లభించును. విద్యార్థులు ఈ సంవత్సరం మరింత శ్రద్ధ వహించడం వల్ల శుభఫలితాలు మరిన్ని కలుగును.

వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు బాగా ఫలించి రుణాలు తీర్చుకుందురు. గృహమునందు శుభకార్యములు చేయుదురు. కౌలుదార్లు కూడా లాభపడుదురు. చేపలు, రొయ్యలు, పౌల్డ్రీ రంగంల వారికి ఈ సంవత్సరం లాభదాయకముగా ఉండును.

వీరిపై నరఘోష అధికముగా ఉండును. ఇందుకోసం నరహోష యంత్రము ధరించినా శుభం కలుగును.

Leave a Reply